రేపు జరుగనున్న కార్మిక సంఘాల సమ్మెకు జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘీభావం
టిడబ్ల్యుజెఎప్ పరకాల నియోజకవర్గ కన్వీనర్ కోగిల చంద్రమౌళి పరకాల నేటిసాక్షి ప్రతినిధి: దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)పరకాల నియోజకవర్గ కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ కోగిల చంద్రమౌళి తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపుల చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. సమ్మెలో జర్నలిస్టులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరకాల నియోజకవర్గంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులంతా జూలై 9న బుధవారం కేంద్ర కార్మిక సంఘాలతో పాటు జరిగే ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు. కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించే ధర్నాలు, ప్రదర్శనలు ఇతర ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వాములం కావడం ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాలన్నారు. జర్నలిస్టులకున్న వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాల పునరుద్ధరణతో జర్నలిస్టు వృత్తి ప్రమాణాలను కాపాడుకునేందుకు అందరూ ఐ...